Tuesday, 22 August 2017

యుపిలో గోరక్ పూర్ బి.ఆర్.డి ఆసుపత్రిలో చిన్నారుల మృతికి నివాళ్ళు అర్పిస్తూ పెద్దాపురంలో సోషల్ మీడియా ప్రతినిధులు కొవ్వొత్తుల ర్యాలి నిర్వహించారు. సోషల్ మీడియా ఫర్ సోసైటి, మన పెద్దాపురం ఫేస్ బుక్ టీమ్ ఆద్వర్యంలో స్ధానిక ఆంజనేయస్వామి గుడి సెంటర్ లో కార్యక్రమం నిర్వహించారు. ఆక్సిజన్ అందకపోవడంతో పసిపిల్లలు మరణించడం పట్ల ఆందోళన వ్యక్తం చేసారు. 70 ఏళ్ల స్వతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న సమయంలో 70 మందికి పైగా పిల్లల ప్రాణాలు కాపాడలేని పరిస్థితి ఏర్పడడం మన వ్యవస్థలో దుస్తితికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాదాన్యతను చాటుతుందని, ప్రభుత్వరంగంలో విద్యవైద్యరంగాలను మెరుగుపర్చాల్సిన అవసరం తేటతెల్లం చేస్తుందన్నారు.






Monday, 21 August 2017

ఎవరిష్టం వారిది... కాదు ర్యాటిఫికేషన్ లో ఒకరిదే ఇష్టం.. ఆ ఇష్టానికి అనుగునంగా ఆమెాదం తెలపాల్సిందే.. పెద్దాపురం మున్సిపాల్టిలో పరిస్దితి. సింగిల్ టెండర్ లపై అడిగినా లేదు. అత్యవసం తప్ప మిగిలినవి ర్యాటీఫే చెయ్యవద్దన్నా లేదు. అంతా ఒక్కటే. లక్షలకు లక్షలు ర్యాటీఫే. దత్తపుత్రునికి అంతా సమర్పణలే..