Tuesday, 24 July 2012



కామ్రేడ్ సూర్యారావు గారి సంస్మరాన సభ  పెద్దాపురం 2-7-2012 న జరిగింది రాష్ట్ర కేంద్రం నుండి కా ; కృష్ణాయ గారు , బాబురావు గారు , వెంకట్ గారు వచ్చారు 

Monday, 23 July 2012

CITU genaral bodi meeting peddapuram 16-07-2012

అసంగాతిత కార్మికుల సమస్యపై సంగం పెడదాం సమరం చేదం కోసం సర్వేలు జాతా కోసం జనరల్ బోడి సమావేశం జరిగింది 16-07-2012

power charges


విద్యుత్ చర్గేలకు నిరసనగా పెద్దాపురం లో తలలేని దిస్తిబోమ దగ్దం 13-07-2012

Saturday, 21 July 2012

Bavana nirmana karmikula bratukulu


భవన కార్మికుల బతుకులు ఇంతేనా..!

ప్రజాశక్తి - కాకినాడ
           ప్రకృతిలో మనకు కనిపించే నిర్మాణాల్లో భవన నిర్మాణ కార్మికుల పాత్ర కీలకం. అందమైన అద్దాల మేడలు, రోడ్లు, బ్రిడ్జిలు, ప్రాజెక్టులు చారిత్రక కట్టడాలు సృష్టించేది నిర్మాణ కార్మికులే. అటువంటి ప్రతిభ కలిగిన కార్మికుల బతుకుల్లో అంధకారం చోటుచేసుకుంటోంది. పెట్టుబడిదారీ సమాజంలో నిర్మాణ రంగం వేగం పుంజుకుంది. పాత వాటి స్థానంలో కొత్త రూపాల్లో నిర్మాణ పనులు నిరంతరం జరుగుతున్నాయి. అపారమైన ఉపాధి అవకాశాలు ఈ రంగంలో ఉన్నాయి. ఇంజనీర్లు వేసే ప్లానులకు విద్యనేర్వని నిర్మాణ కార్మికులు తమ మేథస్సుతో అందమైన నిర్మాణాలుగా ప్రాణ ప్రతిష్ట చేస్తారు. మానవ చరిత్రలో నిర్మాణ రంగం చాలా మార్పులకు గురవుతూ ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంది. 16వ శతాబ్ధం నుంచే నిర్మాణ పనుల ప్రాధాన్యత సంతరించుకుంది. ఈజిప్టు పిరమిడ్లు, తాజ్‌మహల్‌, చార్మినార్‌, కోణార్క్‌ దేవాలయం తదితర కట్టడాలు నిర్మాణ కార్మికుల ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు.
మన జిల్లాలోని భవన నిర్మాణ రంగంలో 2.50 లక్షల మంది కార్మికు లున్నారు. రోజుకు 8 గంటల నుంచి 10 గంటలు పని చేయడం వల్ల ఒక్కో ప్రాంతాన్ని బట్టి రూ.250 నుంచి రూ.300 వరకు రోజు వేతనం వస్తుంది. ఈ పని కష్టంతో కూడుకున్నది. ఎండ, వాన, చలిని తట్టుకుని పని చేయాలి. సిమెంట్‌ ప్రభావం వల్ల దీర్ఘకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. భవనాలపై నుంచి పడిపోవడం, రోడ్డు ప్రమాదాల్లో మరణించడం, లేదా శాశ్వత అంగవైకల్యానికి గురౌతున్నారు. అందమైన భవనాలు నిర్మించే వారి బతుకులు మాత్రం అంధవికారంగా తయారవుతున్నాయి. ప్రభుత్వ నూతన ఆర్థిక విధానాల అమలు ఫలితంగా సిమెంట్‌, ఐరన్‌ ఇతర ముడి సరుకుల ధరలు పెరుగుదల వల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. కోర్డు ఆదేశాలతో ఆరు నెలలుగా ఇసుక ర్యాంపుల్లో తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో జిల్లాలోని 2.50 వేల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఆకలితో పస్తులుండాల్సి వస్తోంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల బలైంది నిర్మాణ కార్మికులు. వీటికి తోడు ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు, ఇంటి పన్నులు, నీటి పన్నులు పెంచి వారిని మరింతగా కుంగదీసింది. నిర్మాణ కార్మికులకు సొంతిళ్లు లేవు. ఏ ఒక్క ప్రజాప్రతినిధీ వారి సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. రిలయన్స్‌ అంబానీ లాంటి బడా పెట్టుబడిదారుడికి రూ.5,700 కోట్ల విలువైన 14 అంత్తుల భవనం ఉంది. అందులో ఉండేది ముగ్గురు. దానిలో పని చేసే కార్మికులు 700 మంది. కానీ ఆ నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులకు కనీసం సొంత గూడు లేదు. సమాజంలో అంతరాలు ఈ విధంగా పెరిగిపోతున్నాయి. కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. ఉండటానికి ఇల్లు, రోజూ ఉపాధి కోరుతున్నారు.
జిల్లాలో అమలు కాని భవన నిర్మాణ కార్మిక చట్టం
భవన నిర్మాణ కార్మికులు ప్రమాద భద్రత కోరుతున్నారు. దాని కోసం సిఐటియు నాయకత్వంలో 1989 నుంచి నిరంతరం ధర్నాలు, చలో అసెంబ్లీలు, సమ్మెలు చేశారు. ఫలితంగా ఆరుగురు ముఖ్యమంత్రుల పాలనలో 1996లో భవన నిర్మాణ కార్మిక చట్టానికి రూపకల్పన జరిగింది. అయితే 2007 వరకు అమలుకు నోచుకోలేదు. పథకం అమలు చేయాలని కోరుతూ యూనియన్‌ 2007 మార్చిలో సుప్రీం కోర్టులో ఫిల్‌ వేసింది. దీంతో సుప్రీం కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయ వేసి, రాష్ట్రంలో తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు పథకం అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ 2007 మే ఒకటో తేదీన చట్టం చేశారు. ఒక మనిషి చేసే పని ద్వారా లాభం పొందిన వ్యక్తి ఆ మనిషి సంక్షేమాన్ని పట్టించుకోవాలనేది చట్టం సారాంశం. ఆ విధంగా ఒక శాతం సెస్‌ వసూలు చేస్తున్నారు. వచ్చిన మొత్తాన్ని ఖర్చు పెట్టేందుకు సంక్షేమ బోర్డు ఏర్పాటైంది. అయితే దీనిలో భవన నిర్మాణ కార్మికులు గానీ, నాయకులు గానీ లేరు. దీంతో కార్మిక కష్టాలు బోర్డులో ఉన్నవారికి పూర్తిస్థాయిలో అర్థం కాలేదు. సంక్షేమ చట్టంలో నమోదు చేయించుకున్న వ్యక్తి గడిచిన సంవత్సరంలో 90 రోజులు తక్కువ కాకుండా పని చేయాలి. ఈ పథకానికి రూ.50 రుసుం, సంవత్సర సభ్యత్వం రూ.12 కలిపి కార్మిక సంక్షేమాధికారి వద్ద నమోదు చేయించుకోవాలి. దీనికి రెండు పాస్‌ పార్ట్‌ ఫొటోలతో ప్రభుత్వం గుర్తింపు పత్రం జారీ చేయాల్సి ఉంది. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. తద్వారా బీమా సాయం ప్రమాదంలో చనిపోయిన లేదా శాశ్వత అంగవైలక్యం పొందిన వారికి రూ.2 లక్షలు, 50 శాతం అంగవైకల్యానికి లక్ష రూపా యలు, 25 శాతం నుంచి 49 శాతం వరకు రూ.50 వేలు, ఒకటి నుంచి 25 శాతం వరకు రూ.25 వేల సాయం అందుతుంది. అనారోగ్యం సమయంలో రోజుకు రూ.100 చొప్పున నెలకు రూ.1,500 మించకుండా మూడు నెలల వరకు ఇస్తారు. మరణించిన కార్మికుల మట్టి ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు ఇస్తారు. మహిళా కార్మికుల, కార్మికుల ఆడపిల్లల పెళ్లి నిమిత్తం ఇద్దరికి రూ.5 వేలు వివాహ కానుకగా ఇస్తారు. నమోదు కాని కార్మికుడు చనిపోతే రూ.5 వేల ఇవ్వాలి. చట్టంలో పైన చెప్పినవన్నీ ఈ జిల్లాలో అమలు కావడం లేదు. కార్మిక సంక్షేమాధికారులను ఇదేమని ప్రశ్నిస్తే 'మన జిల్లాయే కాదు... రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదు' అని దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నారు. ప్రమాద పరిహారాలు పొందే లబ్దిదారులను కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రయివేట్‌ బిల్డర్ల నుంచి, ప్రభుత్వ శాఖల నుంచి సెస్‌ వసూలు చేస్తున్నారు. జిల్లాలో 2.50 లక్షలు మంది కార్మికులుండగా ప్రభుత్వ లెక్కల ప్రకారం నమోదు చేయించుకున్నది లక్షా 26 వేల మంది మాత్రమే. అందులో సుమారు 43 మంది ఉపాధి హామీ కూలీలు కలిపి. నేటికీ కార్మిక శాఖ నూరు శాతం చేయలేదు. రెన్యూవల్స్‌ అయితే కేవలం 60 శాతం మాత్రమే జరిగాయి. దీనికి కారణం కార్మిక శాఖ నిర్లక్ష్యమే. యూనియన్ల ఉన్న చోట రెన్యూవల్స్‌ చేస్తున్నారు. లేని చోట చేయడం లేదు. ఈ ఏడాది మార్చి వరకూ ప్రమాదాలకు గురై శాశ్వతంగా అంగవైకల్యం పొందిన ముగ్గురికి రెండు లక్షలు, పాక్షిక అంగవైకల్యం పొందిన నలుగురికి రూ.50 వేలు ఇచ్చినట్లు కార్మిక శాఖ ప్రకటించింది. ఇటీవల కాలంలో క్లెయిమ్‌లు రావడం లేదు. నిధులు లేవని కార్మిక శాఖాధికారులు చెబుతున్నారు. అయితే సెస్‌ సంక్షేమ బోర్డులో సుమారు రూ.800 కోట్లున్నాయి. వాటిని ప్రభుత్వ ఖజానాకు మళ్లించారు. ఈనేపథ్యంలో కార్మికులు చట్టం అమలుకు పోరాటాలకు సన్నద్ధమౌతున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ సిఐటియు ఆధ్వర్యాన కార్మిక సమస్యలపై సర్వేలు జరుగుతున్నాయి. రానున్న కాలంలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేగాని సమస్యలు పరిష్కారం కావు. ఇందుకు కార్మికులంతా ఏకతాటిపై నిలిచి హక్కులను పరిరక్షించుకోవాలి.
బాలం శ్రీనివాస్‌,
భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకుడు. 

KVPS jatha amalpuram march 2012







దళిత సమసల పరిష్కారం కోసం నెల రోజుల సైకిల్ యాత్ర కే.వీ .పీ .ఎస్ అద్వార్యన అమలాపురం 

CITU May day peddapuram 2012

ప్రపంచ కార్మికులారా ఏకంకండి అన్న మార్క్స్ పిలుపికి  మే దినోస్తావం పలకరింపు






కార్మికులతో పెద్దాపురం లో రాలి 

samsmaran sabha card


yaslapu suryarao

మా కోసం బ్రతికినోడు 
మాలో ఒకడై నిలిచినాడు 
నిత్యం మా వేనంటే ఉంది నడిపినాడు 
కామ్రేడ్ సూర్యారావు మాకు లేరని 
నమలేక ఉండలేక 

Yasalpu Suryarao


కష్టజీవుల కవి యాసలపు సూర్యారావు

                       అక్షరం, ఆచరణ రెంటినీ కలగలిపి నడిపించడం అందరికీ సాధ్యం కాదు. ఉద్యమం, జీవితం చెట్టాపట్టాలేసుకొని నడవడమూ అంత ఆషామాషీ కాదు. ప్రజా ఉద్యమ ప్రస్థానంలో ఆటుపోట్లు తట్టుకొని... కష్టనష్టాలు ఎదుర్కొని... కవిగా, రచయితగా, అంతకుమించి ప్రజా ఉద్యమ కార్యకర్తగా, నాయకుడిగా రాణించటం సామాన్య విషయం కాదు. ఈ కాదు కాదు అనుకుంటున్న కార్యస్థలిలోనే - దిగ్విజయంగా రాణించాడు యాసలపు సూర్యారావు. నీతికీ, నిజాయితీకి, నిబద్ధతకీ నిలువెత్తు రూపంగా నిలిచాడు. 62 ఏళ్ల సూర్యారావు ఈనెల 22న తుదిశ్వాస విడిచాడు.
సూర్యారావు పాఠశాలకు వెళ్లాడో లేదో తెలీదు. ఆ విషయం తనకే గుర్తు లేదు. మట్టి పలక మీద ఏవో కొన్ని అక్షరాలు దిద్దినట్టు గుర్తు. ఊహ తెలీనప్పటినుంచీ కష్టాలు సుపరిచితం. దేన్నీ ఆషామాషీగా తీసుకునే రకం కాదు. దేన్నయినా తరచి తరచి చూడాల్సిందే! గీటు పెట్టి నిగ్గు తేల్చాల్సిందే! తొక్కూ తాలూ తార్కిక వాదంతో పక్కకు తప్పు కోవల్సిందే! వాదనకు నిలబడని ఏ విషయాన్నీ అతడు నమ్మలేదు. కులాలూ మతాలూ, దేవుడూ దెయ్యం లాంటివి చిన్నప్పుడే అతడి మనసు తెరపై నుంచి మాయం అయిపోయాయి. కొందరికి ఆకలీ దారిద్య్రమూ ఎందుకో, ఇంకొందరికి ఆకాశ హార్మ్యాలూ తరగని విలాసాలూ ఎందుకో చిన్నప్పుడే తర్కించి, వాదించి ... ఎడతెగని ఆలోచనలకు గురయ్యాడు. 12 ఏళ్ల వయసులో కమ్యూనిస్టు పార్టీ పరిచయం, విజ్ఞాన తరగతుల ప్రభావం అతడి ఆలోచనలకు పదును పెట్టాయి. సత్యాన్వేషణకు సరైన మార్గం దొరికినట్టయింది. బాల్యంలో నేర్చుకున్న మట్టి పలక అక్షరాలను మనోక్షేత్రంలో నిరంతరం దిద్దడం మొదలెట్టాడు. 'ప్రజాశక్తి' పత్రికను ఇంటింటికీ పంచే పని చేస్తూనే - దాన్లోని వార్తలు, వ్యాసాలూ కూడబలుక్కొని చదివాడు. సైకిల్‌ షాపులో మెకానిక్కుగా ఉంటూ ఖాళీ సమయంలో పుస్తకాలు చదివాడు. తనలో తలెత్తుతున్న ప్రశ్నలన్నింటికీ జవాబులు దొరకటంతో- అతడి ఆలోచనల్లో, ఆచరణలో కొత్త పంథా మొదలైంది.
ప్రజానాట్యమండలి పరిచయం అతడిలో భావోద్వేగం రెక్కలు తొడిగింది. నెమ్మదిగా కవిత్వం రాయడం మొదలెట్టాడు. చుట్టూ చూస్తున్న అన్యాయాలపై నాటికలు రాశాడు. ప్రజల సమస్యలపై పాటలు అల్లాడు. పిల్లలకోసం కథలు వెలువరించాడు. సంస్క ృతి, జానపద కళలు అంటే ఎడతెగని మక్కువ. ఊరూరా తిరుగుతూ బిచ్చమెత్తుకునే కళాకారులతో స్నేహం చేశాడు. వాళ్ల పాటలు, మాటలూ రికార్డు చేశాడు. ఆ కళల పుట్టుకా, వికాసం, ప్రస్తుత పరిస్థితిపై పరిశోధనకు దోహదపడేలా వ్యాసాలు రాశాడు. ప్రాథమిక స్థాయి విద్య కూడా పాఠశాలలో నేర్వని మీరు ఇవన్నీ ఎలా చేయగలిగారు అని ఎవరైనా అడిగితే - ఒకే ఒక్క మాట చెప్పేవాడు : ''కమ్యూనిస్టు పార్టీ గొప్పదనం వల్ల... పార్టీ నేర్పిన ఆలోచనల వల్ల... పార్టీ నేర్పిన క్రమశిక్షణ, అధ్యయన పద్ధతుల వల్ల..'' అని.
సూర్యారావు 'ప్రజ్వలనమ్‌', 'తల్లీ గోదావరీ', 'ఆడు మగాడు', 'పేగుబంధం' పేరుతో నాలుగు కవితా సంపుటాలు వెలువరించారు. ఈ కవితలనిండా సమకాలీన సమస్యలే పరుచుకొని ఉంటాయి. కవితల్లో ఆవేదన, ఆకళింపు ఎంత కనిపిస్తుందో- అవసరమైన చోట ఆగ్రహమూ అంతే ధ్వనిస్తుంది. సమన్వయం, సహనం కనిపిస్తూనే సమరనాదమూ వినిపిస్తుంది. ఆయన కవిత్వం ఆలోచింపచేసేదిగా ఉంటుంది. అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. ప్రపంచీకరణ పేగుబంధాన్ని సైతం విచ్ఛిన్నం చేయడం, సెజ్‌లు రైతులను నిర్వీర్యుల్ని చేయడం; బహుళజాతి సంస్థలు గిరిజనులను, మత్స్యకారులను ఆవాసాలనుంచి వెల్లగొట్టడం .... ఇలాంటి నేటి భారతపు సమకాలీనత అంతా సూర్యారావు కవిత్వంలో సజీవ దృశ్యంగా కనిపిస్తుంది. అణగారిన వర్గాల ఆక్రందన, ఆవేదనా ఆయన అక్షరాల్లో ప్రతిధ్వనిస్తుంది. సమస్యను సమస్యగా చెప్పి ఊరుకోవడం కాదు. దాని మూలాల్లోకి, పర్యవసానాల్లోకి వెళ్లి పాఠకుడి కళ్లకడతాడు. ఎక్కడా నిరాశా, నిస్ప ృహా ధ్వనించదు. స్పష్టమైన కార్యాచరణ, విస్పష్టమైన ఆశాభావం పఠితల్లో కలిగిస్తాడు. తాను స్వయంగా సమస్యలపై పోరాడే కార్యకర్త కావడంవల్ల - ఆయన కవిత్వం నిండా వెల్లువెత్తే పిడికిళ్లూ, మార్మోగే కంఠధ్వనులూ అందమైన రేపటికి భరోసానిస్తాయి.
సూర్యారావు మూడు నాటికలు రాశారు. అవి : ఊరు మేల్కొంది, విముక్తి, మేల్కొలుపు. పాటలతో 'బతుకు పాట' ప్రచురించారు. 'పిట్టకొంచెం - కూత ఘనం' పేరుతో బాలల కథల సంపుటి వెలువరించారు. అనేక రాష్ట్రస్థాయి పోటీల్లో కవితలకు, కథలకు బహుమతులు పొందారు. వీటిన్నింటికీ మించి, తుదిశ్వాస విడిచేవరకూ క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఉద్యమ కార్యకర్తగా ఉన్నారు. సిపిఎం తరఫున రెండుసార్లు పెద్దాపురం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై, ప్రజల సమస్యలపై విశేష కృషి చేశారు. చెంచులు, గంగిరెద్దుల వారు వంటి సంచార జీవులకు పట్టణంలో స్థిరనివాసం, రుణాలు, రేషన్‌ కార్డులు ఇప్పించటానికి వివిధ దశల్లో పోరాడి, విజయం సాధించారు. సాహితీ స్రవంతి తరఫున ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యారావు ఉద్యమ కార్యకర్తగా ఏ సమస్యలపై పనిచేశాడో వాటినే కవిత్వంగా, కథలుగా పలికించాడు. కవిగా, రచయితగా దేన్నయితే రాశాడో - దానినే ఆచరణలో పెట్టటానికి అహర్నిశలూ శ్రమించాడు. ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు అద్దేపల్లి రామ్మోహనరావు పేర్కొన్నట్టు - 'యాసలపు సూర్యారావు ధన్యజీవి. అక్షరాలా కష్టజీవుల కవి. ప్రజల మనిషి.'